Indus | Privacy policy banner

Privacy Policy

ప్రైవసీ పాలసీ

అప్‌డేట్ చేసిన తేదీ [] ఆగస్టు, 2025

ఈ పాలసీ Indus యాప్‌స్టోర్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో ‘OSLabs టెక్నాలజీ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవారు), ఇది కంపెనీల చట్టం, 2013 కింద #51/117, నెల్సన్ టవర్స్, నెల్సన్ మాణిక్కం రోడ్, అమింజికరై, చెన్నై, తమిళనాడు, భారతదేశం – 600029 అడ్రస్‌లోని రిజిస్టర్డ్ ఆఫీస్‌తో ఏర్పాటైన కంపెనీకి వర్తిస్తుంది. ఈ పాలసీ Indus, దాని అనుబంధ సంస్థలు/సంస్థలు/ఉప సంస్థలు/అసోసియేట్‌లు (సందర్భాన్ని బట్టి సమిష్టిగా “Indus / “మేము”/ “మా” / “మాది” అని భావించాలి) https://www.indusappstore.com/ (“Indus వెబ్‌సైట్”), Indus యాప్‌స్టోర్ – డెవలపర్ ప్లాట్‌ఫామ్ (“డెవలపర్ ప్లాట్‌ఫామ్”), Indus యాప్‌స్టోర్ మొబైల్ అప్లికేషన్, ఇంకా ఇతర సంబంధిత సర్వీస్‌లు (సమిష్టిగా “ప్లాట్‌ఫామ్‌లు” అని పిలుస్తారు) ద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎలా సేకరిస్తాయి, నిల్వ చేస్తాయి, ఉపయోగిస్తాయి, ప్రాసెస్ చేస్తాయి అనే దాని గురించి వివరిస్తుంది. మీరు మా ప్లాట్‌ఫామ్‌లను వినియోగించడం ద్వారా, Indus వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా, ఏదైనా ఇతర సైట్‌లలో మా కంటెంట్‌తో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా, మీ సమాచారాన్ని అందించడం ద్వారా లేదా మా ప్రోడక్ట్‌/సర్వీస్‌లను పొందడం ద్వారా, మీరు ఈ ప్రైవసీ పాలసీకి (“పాలసీ”), అలానే వర్తించే సర్వీస్‌/ప్రోడక్ట్‌ నియమ, నిబంధనలకు కట్టుబడి ఉండటానికి స్పష్టంగా అంగీకరిస్తున్నారు. మీరు మాపై ఉంచిన నమ్మకాన్ని మేము విలువైనదిగా భావిస్తాము, అలానే మీ గోప్యతను గౌరవిస్తాము, సురక్షితమైన లావాదేవీలు, అలానే మీ వ్యక్తిగత సమాచార రక్షణ కోసం అత్యున్నత ప్రమాణాలను పాటిస్తాము. ఈ ప్రైవసీ పాలసీ ప్రచురితమైంది, అలానే భారతదేశ చట్టాలు, ఇంకా నియమ, నిబంధనలకు అనుగుణంగా దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, ఇందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 కింద వర్తించే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సహేతుకమైన భద్రతా పద్ధతులు, విధానాలు, సున్నితమైన వ్యక్తిగత డేటా లేదా సమాచారం) నియమాలు, 2011 ఉన్నాయి, దీని ప్రకారం వ్యక్తిగత సమాచార సేకరణ, వినియోగం, నిల్వ, బదిలీ, బయటపెట్టడానికి సంబంధించిన ప్రైవసీ పాలసీని ప్రచురించాల్సి ఉంటుంది. వ్యక్తిగత సమాచారం అంటే ఒక నిర్దిష్ట వ్యక్తికి లింక్ చేయగల మొత్తం సమాచారం, ఇంకా సున్నితమైన వ్యక్తిగత సమాచారం (దాని సున్నితమైన, వ్యక్తిగత స్వభావం వల్ల అధిక డేటా రక్షణ చర్యలు అవసరమయ్యే మొత్తం వ్యక్తిగత సమాచారం) ఉన్నాయి, ఈ రెండింటినీ, అంటే పబ్లిక్ డొమైన్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్న లేదా యాక్సెస్ చేయగల ఏదైనా సమాచారాన్ని మినహాయించి, మిగతా సమాచారం అంతటినీ ఇకపై “వ్యక్తిగత సమాచారం” అని పిలుస్తారు. మీరు ఈ ప్రైవసీ పాలసీతో ఏకీభవించకపోతే, దయచేసి మా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించవద్దు లేదా యాక్సెస్ చేయవద్దు.

సమాచార సేకరణ

మీరు మా సర్వీస్‌లు లేదా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించినప్పుడు లేదా మీరు మాతో బంధాలు కొనసాగించిన సమయంలో మాతో మాట్లాడినప్పుడు చెప్పిన లేదా తెలిపిన మీ వ్యక్తిగత సమాచారాన్ని మేము సేకరించవచ్చు. మీరు అభ్యర్థించిన సర్వీస్‌లను అందించడానికి, ప్లాట్‌ఫామ్‌లను నిరంతరం మెరుగుపరచడానికి సంబంధించిన, తప్పకుండా అవసరమైన వ్యక్తిగత సమాచారాన్ని మేము సేకరిస్తాము.

మేము అలా సేకరించిన వ్యక్తిగత, సున్నితమైన సమాచారంలో కింది అంశాలు ఉంటాయి, అయితే అవి వీటికి మాత్రమే పరిమితం కాదు: 

  • మీరు మా వద్ద అకౌంట్‌ను క్రియేట్ చేసినప్పుడు మీ ఫోన్ నంబర్, ఇమెయిల్ అడ్రస్‌, ఇంకా ఏవైనా ఇతర వివరాలు
  • మీకు ఇప్పటికే మా PhonePe గ్రూప్‌లో అకౌంట్‌ ఉంటే, మేము మీ PhonePe ప్రొఫైల్ నుండి మీ వ్యక్తిగత సమాచారాన్ని పొందవచ్చు, ఇందులో మీ పేరు, ఇమెయిల్ ఐడి, ఇతర ప్రొఫైల్ వివరాలు ఉంటాయి, కానీ వీటికి మాత్రమే ఆ సమాచారం పరిమితం కాదు.
  • మీరు మా ప్లాట్‌ఫామ్ లేదా ప్రకటనలు, అలానే Indus అందించే లేదా ఇతర ప్లాట్‌ఫామ్‌లలో Indus తరఫున అందించే ఇతర కంటెంట్‌ను యాక్సెస్ చేసినప్పుడు మీ అడ్వర్టయిజింగ్ ఐడి, ఇన్‌స్టాల్ చేసిన యాప్‌ల జాబితా, మీ యాప్ వినియోగ సమాచారం, యాప్ సమీక్షలు, రేటింగ్‌లు, యాప్ భాష, యాప్ వినియోగ గణాంకాలు వంటి మీ యాక్టివిటీ సమాచారం.
  • మేము మీ గురించి, మీ యాక్టివిటీల గురించి థర్డ్ పార్టీ భాగస్వాములు, అంటే ఒరిజినల్ పరికరాల తయారీదారులు (OEMలు) నుండి సహా సమాచారాన్ని సేకరిస్తాము, ఉదాహరణకు మేము కలసికట్టుగా సర్వీస్‌లను అందించినప్పుడు లేదా మా ప్రకటనలను వారి ప్లాట్‌ఫామ్‌లో డిస్‌ప్లే చేసినప్పుడు వచ్చిన సమాచారాన్ని భాగస్వామి నుండి సేకరిస్తాము. 
  • మీ మొబైల్ నంబర్, పరికర వివరాలు, అంటే పరికర ఐడెంటిఫైయర్, పరికర భాష, పరికర సమాచారం, ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్, మొబైల్ పరికర తయారీ సంస్థ, మోడల్, గడిపిన సమయం, ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు, సంబంధిత సమాచారం, IP అడ్రస్, లొకేషన్, మైక్రోఫోన్, కనెక్షన్ సమాచారం మొదలైనవి.

ఒకవేళ మీరు డెవలపర్ అయితే, డెవలపర్ ప్లాట్‌ఫామ్‌ నుండి మీ రిజిస్ట్రేషన్, అలానే వెరిఫికేషన్ కోసం మీ పేరు, ఇమెయిల్, పూర్తి చిరునామా, PAN వివరాలు, ఓటరు ఐడి, డ్రైవర్ లైసెన్స్ వివరాలను అదనంగా మేము సేకరిస్తాము. 

మీరు ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించే వివిధ దశలలో సమాచారాన్ని సేకరించవచ్చు, వాటిలో కింది దశలు ఉంటాయి: 

  • ప్లాట్‌ఫామ్‌లను సందర్శించినప్పుడు
  • ప్లాట్‌ఫామ్‌లలో “యూజర్”గా రిజిస్టర్ అయినప్పుడు లేదా ప్లాట్‌ఫామ్‌లలో పేర్కొన్న నియమ, నిబంధనల ప్రకారం ఏదైనా ఇతర సంబంధాన్ని నిర్వహించినప్పుడు, డెవలపర్ ప్లాట్‌ఫామ్‌లో అకౌంట్‌ వెరిఫికేషన్‌ చేసినప్పుడు 
  • ప్లాట్‌ఫామ్‌లలో లావాదేవీలు చేయడం లేదా లావాదేవీలు చేయడానికి ప్రయత్నించడం 
  • ప్లాట్‌ఫామ్‌లు పంపిన లేదా వాటికి చెందిన లింక్‌లు, ఇ-మెయిల్‌లు, చాట్ సంభాషణలు, ఫీడ్‌బ్యాక్‌లు, నోటిఫికేషన్లు, ప్రకటనలను యాక్సెస్ చేసినప్పుడు, ఇంకా మీరు అప్పుడప్పుడు మా సర్వేలలో పాల్గొనాలని నిర్ణయించినప్పుడు 
  • అంతేగాక, మీ PhonePe యూజర్‌ అకౌంట్‌ను క్రియేట్ చేయడంతో సహా ఏదైనా Indus అనుబంధ సంస్థలు/సంస్థలు/ఉప సంస్థలు/అసోసియేట్‌లతో వ్యవహరించినప్పుడు. మీ పేరు, ఇమెయిల్ ఐడి, మీరు అందించే ఇతర ప్రొఫైల్ వివరాలతో సహా కానీ వీటికే పరిమితం కాకుండా, మీ అనుబంధ ప్రొఫైల్ సమాచారం అనేది PhonePe యాప్ అంతటా ఒకేలా ఉంటుంది
  • Indus‌లో కెరీర్ అవకాశాల కోసం అప్లై చేసినప్పుడు లేదా ఉద్యోగ ప్రయోజనాల కోసం Indus‌లో చేరినప్పుడు

సమాచారం యొక్క ఉద్దేశ్యం మరియు ఉపయోగం

Indus మీ వ్యక్తిగత సమాచారాన్ని కింది ప్రయోజనాల కోసం ప్రాసెస్ చేయవచ్చు: 

  • మీ అకౌంట్‌ను క్రియేట్ చేయడం, అలానే మీ ఐడెంటిటీని వెరిఫై చేయడం కోసం, యాక్సెస్ హక్కులను ఇవ్వడం కోసం
  • మేము, మా అనుబంధ సంస్థలు, ఉప సంస్థలు, అసోసియేట్లు లేదా వ్యాపార భాగస్వాములు అందించే ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లకు మీకు యాక్సెస్‌ను ఇవ్వడం కోసం 
  • యాప్‌స్టోర్‌లో సెర్చ్ ఫంక్షనాలిటీని ఎనేబుల్ చేయడం కోసం ఆడియో ప్రశ్నలను క్యాప్చర్ చేయడానికి
  • మీ ప్రశ్నలు, లావాదేవీలు మరియు/లేదా ఏవైనా ఇతర అవసరాల కోసం మీతో కమ్యూనికేట్ కావడానికి 
  • మీరు ఎదుర్కొంటున్న ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి కమ్యూనికేషన్ సమాచారాన్ని అనలైజ్ చేయడం కోసం. ఉదాహరణకు, చివరగా ఎప్పుడు అప్‌లోడ్/కన్వర్షన్/చర్య చేశారు, మా సర్వీస్‌లను మీరు చివరిగా ఎప్పుడు ఉపయోగించారు, అలానే ఇలాంటి ఇతర యాక్టివిటీలను చెక్ చేయడానికి.
  • Indus యాప్ స్టోర్, అలానే Indus నుండి మీరు డౌన్‌లోడ్ చేసుకునే ఏదైనా ఇతర యాప్‌కు సంబంధించిన బగ్ ఫిక్స్‌లు, మెరుగైన ఫంక్షన్లు, మిస్ అయిన ప్లగిన్‌లు, కొత్త వెర్షన్‌లు (అప్‌డేట్లు)కు సంబంధించి మీకు సమాచారం, సొల్యూషన్లను అందించడం కోసం
  • మీకు నచ్చేందుకు లేదా ఉపయోగపడేందుకు అవకాశమున్న కొత్త యాప్‌లను సిఫార్సు చేయడం కోసం మీరు ఇదివరకే ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు వంటి సమాచారాన్ని మేము ఉపయోగించవచ్చు
  • యూజర్‌ ప్రవర్తనను సమగ్రంగా అనలైజ్ చేసి మీకు నచ్చేందుకు లేదా ఉపయోగపడేందుకు అవకాశమున్న యాప్‌లు, వీడియోలను మీకు సిఫార్సు చేయడం కోసం, అలానే వివిధ ప్రక్రియలు/అప్లికేషన్‌ల సమర్పణ/ప్రోడక్ట్‌/సర్వీస్‌‌ల లభ్యతలో మీ యూజర్ ఎక్స్‌పీరియెన్స్‌ను మెరుగుపర్చడం కోసం 
  • మీకు యాప్‌లు, నోటిఫికేషన్లను అందించే విధానాన్ని కస్టమైజ్ చేయడానికి, యాప్‌స్టోర్‌లోని యాప్‌లను మేనేజ్ చేయడం, అలానే అన్‌ఇన్‌స్టాల్ చేయడంలో మీకు సహాయపడటానికి, అనలిటిక్స్ సర్వీస్‌ను అందించడానికి, ప్లాట్‌ఫామ్‌లలో మీ అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడటానికి. 
  • మీ గురించి మా వద్ద ఉన్న డేటాను ఉపయోగించి, వర్తించే చోట, మీ యూజర్ జర్నీని సులభతరం చేయడం కోసం, ఇంకా ఎనేబుల్ చేయడం కోసం
  • ఎప్పటికప్పుడు ప్రోడక్ట్‌లు/సర్వీస్‌లను మానిటర్ చేసి, సమీక్షించడం కోసం; మీ ఎక్స్‌పీరియెన్స్‌ను సురక్షితంగా మార్చడానికి, సులభతరం చేయడానికి వీలుగా సర్వీస్‌లను కస్టమైజ్ చేయడం కోసం, అలానే ఆడిట్‌లను నిర్వహించడం కోసం
  • ప్లాట్‌ఫామ్‌లు లేదా థర్డ్ పార్టీ లింక్‌ల ద్వారా మీరు పొందిన/అభ్యర్థించిన ప్రోడక్ట్‌లు, సర్వీస్‌ల కోసం మిమ్మల్ని సంప్రదించడానికి థర్డ్ పార్టీలను అనుమతించడం కోసం 
  • భద్రతా ఉల్లంఘనలు, దాడులను గుర్తించడానికి; అకౌంట్లు, యాక్టివిటీని వెరిఫై చేయడానికి, అలానే మా సర్వీస్‌ల భద్రత, రక్షణను ప్రోత్సహించడానికి, అంటే అనుమానాస్పద కార్యకలాపాలు లేదా మా నియమాలు లేదా పాలసీల ఉల్లంఘనను పరిశోధించి, నిరోధించడానికి, చట్టవిరుద్ధమైన లేదా అనుమానిత మోసం లేదా మనీలాండరింగ్ కార్యకలాపాలు, ఇతర నేర కార్యకలాపాలపై ఇంటర్నల్ లేదా ఎక్స్‌టర్నల్ ఆడిట్ లేదా Indus లేదా భారతదేశ అధికార పరిధిలో ఉన్న లేదా భారతదేశ అధికార పరిధి వెలుపల ఉన్న ప్రభుత్వ సంస్థల దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ ఆడిట్‌లను నిర్వహించడం ద్వారా చర్యలు తీసుకోవడం వంటి వాటి కోసం 
  • మార్కెట్ రీసెర్చ్ ప్రయోజనాల కోసం మిమ్మల్ని సంప్రదించడానికి మా నియమ, నిబంధనలను అమలు చేయడం కోసం; ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఆఫర్లు, ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లు, అప్‌డేట్ల గురించి మీకు తెలపడం కోసం; మార్కెటింగ్, ప్రకటనలను డిస్‌ప్లే చేయడం, కస్టమైజ్ చేసిన ప్రోడక్ట్‌లు, ఆఫర్లను అందించడం ద్వారా మీ ఎక్స్‌పీరియెన్స్‌ను కస్టమైజ్ చేసి, మెరుగుపర్చడం కోసం. 
  • మీ యూజర్ ఎక్స్‌పీరియెన్స్‌ను, అలానే మా సర్వీస్‌ల మొత్తం నాణ్యతను మెరుగుపరచడానికి కుక్కీలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాల నుండి సేకరించిన సమాచారాన్ని ఉపయోగించడం కోసం 
  • సర్వేలు, పరిశోధనలను నిర్వహించడం, డెవలప్‌మెంట్‌లో ఫీచర్లను టెస్ట్ చేయడం, అలానే మేము తప్పనిసరిగా పరిశీలించాల్సిన సమాచారాన్ని అనలైజ్ చేసి, మా ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లను మెరుగుపర్చడం కోసం, కొత్త ప్రోడక్ట్‌లు, ఫీచర్లను డెవలప్ చేయడం కోసం, అలానే ఆడిట్, ట్రబుల్‌షూటింగ్ యాక్టివిటీలను నిర్వహించడం కోసం
  • మా ప్రకటనలు, ప్రమాణాల వ్యవస్థలను మెరుగుపరచడం కోసం, ఎందుకంటే దీని ద్వారా మేము మీకు సంబంధిత ప్రకటనలను చూపించగలము, అలానే ప్రకటనలు, సర్వీస్‌ల ప్రభావాన్ని, వాటి పరిధిని కొలవగలము 
  • మా సర్వీస్‌లు ఎలా ఉపయోగిస్తున్నారో అనలైజ్ చేయడం, ప్రకటనలు, సర్వీస్‌ల ప్రభావాన్ని అంచనా వేయడం, కస్టమర్ సర్వీస్‌ను అందించడం మొదలైన వాటి కోసం మా బిజినెస్‌కు సపోర్ట్ చేసే విక్రేతలు, సర్వీస్‌ ప్రొవైడర్లు, ఇతర భాగస్వాములతో అడ్వర్టయిజ్‌మెంట్ ఐడిలు వంటి సమాచారాన్ని షేర్ చేయడం కోసం. 
  • మీరు మాతో మాట్లాడిన సమయంలో మీకు మేము అందించే సహాయం/సలహాల నాణ్యతను నిర్ధారించుకోవడానికి మా ప్రతినిధులు, ఏజెంట్లకు శిక్షణ ఇవ్వడం కోసం
  • వివాదాలను పరిష్కరించడానికి; సమస్యలను పరిష్కరించడానికి; సాంకేతిక సహకారం, బగ్‌లను ఫిక్స్ చేయడానికి; సురక్షితమైన సర్వీస్‌ను ప్రోత్సహించడంలో సహాయపడటానికి
  • చట్టపరమైన బాధ్యతలను నెరవేర్చడం కోసం 

ఇతర చట్టబద్ధమైన బిజినెస్‌ అవసరాల కోసం కూడా మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేయవచ్చు, సాధ్యమైనంత వరకు ప్రాసెసింగ్‌ను తగ్గించడానికి తగిన చర్యలు తీసుకుంటామని మేము నిర్ధారిస్తాము, దీని వల్ల ఇది మీ ప్రైవసీలో జోక్యాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గిస్తుంది.

కుక్కీలు లేదా అటువంటి టెక్నాలజీలు

మా వెబ్ పేజీ ఫ్లోను అనలైజ్ చేయడానికి, ప్రకటనల ప్రభావాన్ని అంచనా వేయడానికి, మా ప్లాట్‌ఫామ్ వినియోగాన్ని అర్థం చేసుకోవడానికి, అలానే నమ్మకాన్ని, భద్రతను ప్రోత్సహించడానికి ప్లాట్‌ఫామ్‌లోని కొన్ని పేజీలలో “కుక్కీలు” లేదా దాన్ని పోలి ఉండే టెక్నాలజీల వంటి డేటా సేకరణ పరికరాలను మేము ఉపయోగిస్తాము. “కుక్కీలు” అనేవి మీ పరికర హార్డ్-డ్రైవ్/స్టోరేజ్‌లో ఉంచిన చిన్న ఫైల్‌లు, ఇవి మా సర్వీస్‌లను మీకు అందించడంలో మాకు సహాయపడతాయి. కుక్కీల్లో మీ వ్యక్తిగత సమాచారం ఉండదు. మేము అందించే కొన్ని ఫీచర్లు “కుక్కీ” లేదా వాటిని పోలి ఉండే టెక్నాలజీలను ఉపయోగించినప్పుడు మాత్రమే లభిస్తాయి. సెషన్ సమయంలో మీ పాస్‌వర్డ్‌ను చాలా తక్కువ సార్లు ఎంటర్ చేసేందుకు వీలుగా కూడా మేము కుక్కీలను ఉపయోగిస్తాము. మీ ఆసక్తులను బట్టి తగ్గిన సమాచారాన్ని అందించడంలో కుక్కీలు లేదా వాటిని పోలి ఉన్న టెక్నాలజీలు కూడా మాకు సహాయపడతాయి. చాలా కుక్కీలు “సెషన్ కుక్కీలు”, అంటే అవి సెషన్ చివరిలో మీ పరికర హార్డ్-డ్రైవ్/స్టోరేజ్ నుండి ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయి. మీ బ్రౌజర్/పరికరం అనుమతించిన మేరకు ఎప్పుడైనా మా కుక్కీలను లేదా వాటిని పోలి ఉన్న టెక్నాలజీలను తిరస్కరించే/తొలగించే హక్కు మీకు ఉంది, అయితే ఆ సందర్భంలో మీరు ప్లాట్‌ఫామ్‌లలో కొన్ని ఫీచర్లను ఉపయోగించలేకపోవచ్చు, అంతేగాక సెషన్ సమయంలో మీరు మీ పాస్‌వర్డ్‌ను చాలా ఎక్కువ సార్లు ఎంటర్ చేయాల్సి రావచ్చు. వీటికి తోడు, థర్డ్ పార్టీలు ఉంచిన ప్లాట్‌ఫామ్‌లకు చెందిన కొన్ని పేజీలలో “కుక్కీలు” లేదా వాటిని పోలి ఉన్న ఇతర టెక్నాలజీలను మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు. థర్డ్ పార్టీల కుక్కీల వాడకాన్ని మేము నియంత్రించము.

సమాచారాన్ని షేర్ చేయడం, బయట పెట్టడం

వర్తించే చట్టాల ప్రకారం అనుమతించిన విధంగా, శ్రద్ధగా, నిశితంగా పరిశీలించి, అలానే ఈ పాలసీలో నిర్దేశించిన ప్రయోజనాలకు అనుగుణంగా మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేస్తాము.

మీ లావాదేవీ సమయంలో మా వ్యాపార భాగస్వాములు, సర్వీస్‌ ప్రొవైడర్లు, అనుబంధ సంస్థలు, అసోసియేట్‌లు, ఉప సంస్థలు, నియంత్రణ సంస్థలు, అంతర్గత బృందాలు మొదలైన వివిధ వర్గాల గ్రహీతలకు మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవచ్చు.

వర్తించే మేరకు, తప్పక తెలుసుకోవాల్సిన సందర్భాన్ని బట్టి, కింది ప్రయోజనాల కోసం మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేస్తాం: 

  • వర్తించే మేరకు, PhonePe అందించే సర్వీస్‌లు అన్నింటికీ ఒకే(కామన్) లాగిన్‌ను క్రియేట్ చేయడం కోసం
  • మీరు పొందుతున్న యాప్‌లు/సర్వీస్‌ల సౌకర్యాలను ఎనేబుల్ చేయడానికి, ఇంకా మీరు, సర్వీస్‌ ప్రొవైడర్‌/డెవలపర్ మధ్య, మీరు అభ్యర్థించిన విధంగా, సర్వీస్‌లను సులభతరం చేయడం కోసం
  • కమ్యూనికేషన్, మార్కెటింగ్, ప్రకటనలు, డేటా, సమాచార నిల్వ, ప్రసారం, భద్రత, అనలిటిక్స్, మోసం గుర్తింపు, ప్రమాద అంచనా, పరిశోధనలకు సంబంధించిన సర్వీస్‌ల కోసం 
  • మీ పరికరంలో మా సర్వీస్‌లను పర్సనలైజ్ చేయడానికి, అలానే మెరుగుపర్చడం కోసం
  • Indus యాప్ స్టోర్, ఇంకా దానిలో ఉన్న ఇతర యాప్‌ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను అందించడం కోసం
  • మా నియమాలు లేదా ప్రైవసీ పాలసీని అమలు చేయడం కోసం; ప్రకటన, పోస్టింగ్ లేదా ఇతర కంటెంట్, థర్డ్ పార్టీ హక్కులను ఉల్లంఘిస్తుందనే వాదనలకు ప్రతిస్పందించడానికి; లేదా మా యూజర్లు లేదా సాధారణ ప్రజల హక్కులు, ఆస్తి లేదా వ్యక్తిగత భద్రతను రక్షించడం కోసం
  • సబ్‌పోనా, కోర్టు ఆర్డర్ లేదా ఇతర చట్టపరమైన ప్రక్రియకు ప్రతిస్పందించడం కోసం, చట్టం ప్రకారం లేదా పూర్తి నమ్మకంతో చేయవలసి వచ్చినప్పుడు, వాటి ప్రకారం బయటపెట్టడం అనేది సహేతుకంగా అవసరమని మేము నమ్మినప్పుడే ఇలా చేస్తాం 
  • ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలు/తీసుకున్న చర్యలకు, అలానే ప్రయోజనాలకు ప్రభుత్వ అధికారులు అభ్యర్థించినప్పుడు 
  • ఫిర్యాదుల పరిష్కారం, వివాదాల పరిష్కారం కోసం 
  • Indus‌లోని అంతర్గత దర్యాప్తు విభాగం లేదా భారత అధికార పరిధి లోపల లేదా వెలుపలి దర్యాప్తు ప్రయోజనాల కోసం Indus నియమించిన ఏజెన్సీలకు షేర్ చేస్తాం 
  • మేము (లేదా మా ఆస్తులు) ఏదైనా వ్యాపార సంస్థలో విలీనం చేయాలని లేదా దాన్ని స్వాధీనం చేసుకోవాలని మేము ప్లాన్ చేస్తే, లేదా అటువంటి ఇతర వ్యాపార సంస్థతో కలిపి మా వ్యాపారాన్ని రీ-ఆర్గనైజ్ చేయడం, మళ్లీ నిర్మించడం వంటి వాటి కోసం

ఈ పాలసీలో పేర్కొన్న ప్రయోజనాల ప్రకారం థర్డ్ పార్టీలకు సమాచారాన్ని షేర్ చేసినప్పటికీ, మీ వ్యక్తిగత సమాచారం ప్రాసెసింగ్ అనేది వారి పాలసీల ప్రకారమే జరుగుతుంది. వర్తించే చోట, సాధ్యమైనంతవరకు ఈ థర్డ్ పార్టీలపై కఠినమైన లేదా కాస్త తక్కువ కఠినమైన గోప్యతా రక్షణ బాధ్యతలు విధించేలా Indus చూసుకుంటుంది. అయితే, ఈ పాలసీలో పేర్కొన్న ప్రయోజనాల ప్రకారం లేదా వర్తించే చట్టాల ప్రకారం నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ అధికారులు వంటి థర్డ్ పార్టీలతో వ్యక్తిగత సమాచారాన్ని Indus షేర్ చేసుకోవచ్చు. ఈ థర్డ్ పార్టీలు లేదా వారి పాలసీల ప్రకారం మీ వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించినందుకు మేము ఎటువంటి బాధ్యత లేదా లయబిలిటీని అంగీకరించము.

నిల్వ (స్టోరేజ్) మరియు నిలుపుదల (రిటెన్షన్‌)

వర్తించే మేరకు, మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని భారతదేశంలో నిల్వ చేస్తాము, అలానే వర్తించే చట్టాలకు అనుగుణంగా, దాన్ని సేకరించిన ప్రయోజనం లేదా ఉద్దేశం కోసం అవసరమైన దానికంటే ఎక్కువ కాలం పాటు దాన్ని ఉంచుతాము. అయితే, మోసం లేదా భవిష్యత్తులో దాని దుర్వినియోగాన్ని నిరోధించడం అవసరమని మేము నమ్మితే లేదా ఏదైనా చట్టపరమైన/నియంత్రణ చర్యలు పెండింగ్‌లో ఉన్న సందర్భంలో లేదా ఆ ప్రభావం మేరకు ఏదైనా చట్టపరమైన మరియు/లేదా మార్గదర్శక సూచనను పొందినప్పుడు లేదా ఇతర చట్టబద్ధమైన ప్రయోజనాల కోసం చట్టం ప్రకారం అవసరమైతే మీకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని మేము భద్రపర్చవచ్చు. వ్యక్తిగత సమాచారం దాని నిలుపుదల వ్యవధిని చేరుకున్న తర్వాత, వర్తించే చట్టాలకు అనుగుణంగా దాన్ని తొలగిస్తాము.

సురక్షిత భద్రతా పద్ధతులు

యూజర్ల వ్యక్తిగత సమాచారం, సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడానికి Indus టెక్నికల్, ఫిజికల్ భద్రతా చర్యలను అమలు చేస్తోంది. మా భద్రతా చర్యలు ఎంత ప్రభావవంతంగా ఉన్నా, ఏ భద్రతా వ్యవస్థ కూడా ఛేదించలేనంత బలమైనది కాదని మేము అర్థం చేసుకున్నాము. అందువల్ల, మా సహేతుకమైన భద్రతా పద్ధతుల్లో భాగంగా, మా నెట్‌వర్క్, సర్వర్‌లలో మోషన్‌లో ఉన్న డేటా, రెస్ట్‌లో ఉన్న డేటా రెండింటికీ తగిన సమాచార భద్రతా ఎన్‌క్రిప్షన్ లేదా నియంత్రణలు ఉన్నాయని నిర్ధారించడం కోసం మేము కఠినమైన ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ రివ్యూలను చేపడతాము. సర్వర్‌లలో స్టోర్ చేసిన డేటాబేస్‌ అనేది ఫైర్‌వాల్ వెనుక సురక్షితంగా ఉంటుంది; సర్వర్‌లకు పాస్‌వర్డ్-ప్రొటెక్షన్‌ యాక్సెస్ ఉంది, అలానే ఆ యాక్సెస్‌ పొందడానికి కఠినమైన పరిమితులు ఉన్నాయి. ఇకపోతే, మీ లాగిన్ ఐడి, పాస్‌వర్డ్ ప్రైవసీ, భద్రతను కాపాడటానికి మీరే బాధ్యత వహిస్తారు. దయచేసి మీ ప్లాట్‌ఫామ్‌ల లాగిన్, పాస్‌వర్డ్, OTP వివరాలను ఎవరికీ షేర్ చేయకండి. మీ వ్యక్తిగత సమాచారం వాస్తవంగా చోరీకి (వేరే వాళ్లకి తెలిసిందని) గురైనా లేదా అలా జరిగిందనే అనుమానం కలిగినా వెంటనే మాకు తెలియజేయాల్సిన బాధ్యత మీదే.

థర్డ్ పార్టీ ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లు లేదా వెబ్‌సైట్‌లు

మీరు ప్లాట్‌ఫామ్‌లలో సర్వీస్‌ ప్రొవైడర్ల ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లను పొందుతున్నప్పుడు, మీ వ్యక్తిగత సమాచారాన్ని సంబంధిత సర్వీస్‌ ప్రొవైడర్లు సేకరించవచ్చు, అలానే ఆ వ్యక్తిగత సమాచారాన్ని వారి ప్రైవసీ పాలసీ ప్రకారం నిర్వహిస్తారు. ఆయా సర్వీస్‌ ప్రొవైడర్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎలా నిర్వహిస్తారో అర్థం చేసుకోవడానికి మీరు వారి ప్రైవసీ పాలసీ, సర్వీస్ నియమాలను చూడవచ్చు. మీరు మా ప్లాట్‌ఫామ్‌లను సందర్శించినప్పుడు మా సర్వీస్‌లలో ఇతర వెబ్‌సైట్‌లు లేదా అప్లికేషన్ల లింక్‌లు ఉండవచ్చు. అటువంటి వెబ్‌సైట్‌లు లేదా అప్లికేషన్‌లను వాటి సంబంధిత ప్రైవసీ పాలసీ ప్రకారం నిర్వహిస్తారు, అవి మా నియంత్రణలో ఉండవు. మీరు మా సర్వర్‌లను దాటి బయటకు వెళ్లిన తర్వాత (మీ బ్రౌజర్‌లోని లొకేషన్ బార్‌లోని లేదా మీరు రీ-డైరెక్ట్ అయిన m-సైట్‌లోని URLని చెక్ చేసి, మీరు ఎందులో లేదా ఎక్కడ ఉన్నారో చెప్పవచ్చు), ఈ వెబ్‌సైట్‌లు లేదా అప్లికేషన్‌లలో మీరు అందించే ఏదైనా వ్యక్తిగత సమాచారం వినియోగం అనేది మీరు సందర్శిస్తున్న అప్లికేషన్/వెబ్‌సైట్ ఆపరేటర్ ప్రైవసీ పాలసీ ప్రకారం ఉంటుంది. ఆ పాలసీకి, మా పాలసీకి మధ్య వ్యత్యాసాలు ఉండవచ్చు, అలానే ఆయా అప్లికేషన్లు లేదా వెబ్‌సైట్లను ఉపయోగించడానికి ముందు ఆ పాలసీలను సమీక్షించమని లేదా డొమైన్ యజమాని నుండి పాలసీలకు యాక్సెస్‌ను పొందాలని మిమ్మల్ని మేము కోరుతున్నాము. ఈ థర్డ్ పార్టీలు లేదా వారి పాలసీలు మీ వ్యక్తిగత సమాచారాన్ని వినియోగించడానికి సంబంధించి మాకు ఎటువంటి బాధ్యత లేదా లయబిలిటీ ఉండదు. ఈ ప్లాట్‌ఫామ్‌లు చాట్ రూమ్‌లు, ఫోరమ్‌లు, మెసేజ్ బోర్డులు, ఫీడ్‌బ్యాక్ ఫారమ్‌లు, వెబ్ లాగ్‌లు / “బ్లాగులు”, న్యూస్ గ్రూపులు మరియు / లేదా ఇతర పబ్లిక్ మెసేజింగ్ ఫోరమ్‌లను మీకు అందుబాటులో ఉంచవచ్చు. వీటిలో మీరు వెల్లడించిన ఏదైనా సమాచారం పబ్లిక్ సమాచారంగా మారుతుందని దయచేసి గుర్తుంచుకోండి, వాటిలో మీ వ్యక్తిగత సమాచారాన్ని మీరు బయటపెట్టకూడదు.

మీ సమ్మతి

మేము మీ సమ్మతితోనే మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాము. మీరు ప్లాట్‌ఫామ్‌లు లేదా సర్వీస్‌లను ఉపయోగించడం ద్వారా మరియు/లేదా మీ వ్యక్తిగత సమాచారాన్ని అందించడం ద్వారా, ఈ ప్రైవసీ పాలసీకి అనుగుణంగా మీ వ్యక్తిగత సమాచారాన్ని Indus ప్రాసెస్ చేయడానికి మీరు సమ్మతిస్తున్నారు. మీరు ఇతర వ్యక్తులకు సంబంధించిన ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని మాకు వెల్లడిస్తే, మీకు అలా చేయడానికి అధికారం ఉందని మీరు స్పష్టం చేస్తున్నారు, అలా వెల్లడించిన సమాచారాన్ని ఈ ప్రైవసీ పాలసీకి అనుగుణంగా ఉపయోగించడానికి మాకు అనుమతిస్తున్నారు. ఇంకా, ఏదైనా ఆథరైజ్డ్ DND రిజిస్ట్రీల్లో మీరు రిజిస్టర్ అయ్యారనే దానితో సంబంధం లేకుండా, ఈ పాలసీలో పేర్కొన్న ప్రయోజనాల కోసం ఫోన్ కాల్స్, ఇ-మెయిల్ వంటి ఛానెళ్ల ద్వారా మీతో కమ్యూనికేట్ అవ్వడానికి మాకు అధికారం ఇచ్చి, అంగీకారాన్ని తెలుపుతున్నారు.

ఎంచుకోవడం/నిష్క్రమించడం

మీరు అకౌంట్‌ను సెటప్ చేసిన తర్వాత, మా సర్వీస్‌లను పొందకుండా లేదా మా నుండి అనవసరమైన (ప్రచార, మార్కెటింగ్ సంబంధిత) కమ్యూనికేషన్‌లు రాకుండా నిలిపివేసే అవకాశాన్ని మేము యూజర్లు అందరికీ ఇస్తాము. మీరు మా అన్ని లిస్ట్‌లు, న్యూస్‌‌లెటర్ల నుండి మీ కాంటాక్ట్ వివరాలను తొలగించాలనుకుంటే లేదా మా సర్వీస్‌లను నిలిపివేయాలనుకుంటే, దయచేసి ఇమెయిల్‌లలో ఉన్న అన్‌సబ్‌స్క్రైబ్ బటన్‌పై క్లిక్ చేయండి లేదా ప్లాట్‌ఫామ్‌లలోని ‘సహాయ’ విభాగం ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.

మా ప్రోడక్ట్‌లు/సర్వీస్‌ల‌కు సంబంధించి మీకు కాల్ వస్తే, ఆ కాల్‌లోనే మా ప్రతినిధికి మీ అభిప్రాయాన్ని తెలిపి, మీరు అలాంటి కాల్స్‌ను నిలిపివేయవచ్చు.

వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయడం/సరిదిద్దడం

మీరు మాకు అభ్యర్థనను పంపి, మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు, అలానే సమీక్షించవచ్చు. పైన పేర్కొన్న అభ్యర్థనలలో దేనినైనా పంపడానికి, ఈ పాలసీలోని ‘మమ్మల్ని సంప్రదించండి’ విభాగం కింద అందించిన కాంటాక్ట్ వివరాలను ఉపయోగించి మీరు మాకు లెటర్ రాయవచ్చు, మీరు మీ అకౌంట్‌ను లేదా వ్యక్తిగత సమాచారాన్ని తొలగించాలనుకుంటే, దయచేసి ప్లాట్‌ఫామ్‌లలోని ‘సహాయ‘ విభాగం ద్వారా మమ్మల్ని సంప్రదించండి. అయితే, మీ వ్యక్తిగత సమాచారాన్ని దాయడం అనేది వర్తించే చట్టాలకు లోబడి ఉంటుంది. పైన పేర్కొన్న అభ్యర్థనల విషయంలో, మీ గుర్తింపును, అలానే అథెంటికేషన్‌ను నిర్ధారించడం కోసం Indus మీ నుండి నిర్దిష్ట సమాచారాన్ని అభ్యర్థించవచ్చు. మీ వ్యక్తిగత సమాచారాన్ని పొందే హక్కు లేని వ్యక్తికి ఆ సమాచారాన్ని బయటపెట్టే లేదా తప్పుగా సవరించే లేదా తొలగించే అవకాశం లేకుండా చేయడం కోసం తీసుకునే భద్రతా చర్య ఇది. మీరు యాక్సెస్ చేస్తున్న ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించిన నిర్దిష్ట సమాచారం ఏదైనా మీకు కావాల్సిన సందర్భాల్లో, ప్లాట్‌ఫామ్‌లలో సులభంగా యాక్సెస్ చేయగల నియమ, నిబంధనలను చదవమని మేము మిమ్మల్ని కోరుతున్నాము. దాని గురించి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం, మీరు ప్లాట్‌ఫామ్‌లలోని ‘సహాయ‘ విభాగం ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.

పిల్లల సమాచారం

ఎవరైనా పిల్లల నుండి, అంటే వారి వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ అని తెలిసిన తర్వాత, వారి నుండి వ్యక్తిగత సమాచారాన్ని అభ్యర్థించము లేదా సేకరించము, భారతీయ కాంట్రాక్ట్ చట్టం, 1872 ప్రకారం చట్టబద్ధంగా ఒప్పందాన్ని కుదుర్చుకోగలిగే అధికారం ఉన్న వ్యక్తులకు మాత్రమే మా ప్లాట్‌ఫామ్‌లను వినియోగించే అవకాశం ఉంటుంది. మీకు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే, మీరు మీ తల్లిదండ్రులు, చట్టపరమైన సంరక్షకులు లేదా ఏదైనా బాధ్యతాయుతమైన పెద్దల పర్యవేక్షణలో ప్లాట్‌ఫామ్‌లు లేదా సర్వీస్‌లను ఉపయోగించాలి.

పాలసీలో మార్పులు చేయడం

మీకు ముందస్తు రాతపూర్వక నోటీసు ఇవ్వకుండా మా సొంత అభీష్టానుసారం ఎప్పుడైనా ఈ ప్రైవసీ పాలసీలోని భాగాలను మార్చడానికి, సవరించడానికి, యాడ్ చేయడానికి లేదా తొలగించడానికి మాకు హక్కు ఉంది. ఈ మార్పుల గురించి మీకు తెలపడానికి మేము సహేతుక పద్ధతిలో ప్రయత్నించవచ్చు, అయితే అప్‌డేట్‌లు/మార్పుల గురించి తెలుసుకోవడం కోసం ప్రైవసీ పాలసీని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన బాధ్యత మీదే. మార్పులను పోస్ట్ చేసిన తర్వాత మీరు మా సర్వీస్‌లు/ప్లాట్‌ఫామ్‌లను నిరంతరం ఉపయోగిస్తుంటే, మీరు ఆ సవరణలను (మార్పులను) యాక్సెప్ట్ చేసి, వాటికి అంగీకారం తెలిపారని అర్థం. మీరు ఇప్పటికే షేర్ చేసిన వ్యక్తిగత సమాచార భద్రతను తగ్గించే విధంగా పాలసీలకు మేము ఎప్పటికీ మార్పులు చేయము.

మమ్మల్ని సంప్రదించండి

మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేయడం గురించి లేదా ఈ ప్రైవసీ పాలసీ గురించి మీకు ఏవైనా ప్రశ్నలు, సమస్యలు లేదా ఫిర్యాదులు ఉంటే, ప్లాట్‌ఫామ్‌లలోని ‘సహాయ‘ విభాగం ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. తగిన కాల పరిమితిలోపు మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాము. పరిష్కారం చూపడంలో ఏదైనా ఆలస్యం జరిగితే మీకు ముందుగానే తెలుపుతాము.